రాయదుర్గం: మురడి గ్రామంలో కొడవలితో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
డి.హిరేహాల్ మండలం మురడిలో వీరేష్ అనే వ్యక్తి కొడవలితో వీరంగం సృష్టించాడు. నాగరాజు, వీరేష్ గొడవపడుతుండగా నరసింహరెడ్డి సముదాయించేందుకు వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన వీరేష్ రాయితో దాడికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. తర్వాత కొడవలి తీసుకుని "మేము గొడవపడితే నువ్వెవడివి విడిపించడానికి" అంటూ నరసింహరెడ్డిని చంపుతానని బెదిరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బాధితుడి ఫిర్యాదుతో గురువారం వీరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.