మార్కాపురం: జిల్లా కేంద్రంలో కంపు కొడుతున్న మురుగు కాలవలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న మురుగు కాలువలు పరిశుద్ధం లోపించి అద్వానంగా మారాయి. చెత్తాచెదారం చేరి కాలవలు పూర్తిగా నిండిపోయి కంపు కొడుతున్నాయి. స్థానిక కంభం రోడ్డు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముందు మురుగు కాలువ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.