యర్రగొండపాలెం: దోర్నాల మండలం హసనాబాద్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా పేరు పెట్టడం పై గ్రామస్తులు ఆందోళన
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం హసనాబాదులో జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. టోల్ ప్లాజాకు జమ్మి దోర్నాల పేరు పెట్టడంపై ఆసనాబాద్ గ్రామస్తుల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పేరు ఏర్పాటు విషయంలో తమకు కొంత సమయం ఇవ్వాలని గ్రామస్తులు అధికారులను కోరారు.