యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని గ్రామాలలో పూర్తిస్థాయి నీటి సరఫరా చేయాలని స్థానికుల విజ్ఞప్తి
త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదని స్థానికులు ఆరోపించారు. విపరీతంగా ఎండలు కాస్తున్న నేపథ్యంలో గ్రామాలలో సరిపడా మంచినీరు అందడం లేదని వారన్నారు. ఉన్నత అధికారులు దృష్టి సారించి గ్రామాలలో మంచినీటి సరఫరాను పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో గ్రామాలకు మంచినీటిని అందించాలన్నారు