నారాయణపూర్: సంస్థాన్ నారాయణపురంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి: డీవైఎఫ్ఐ
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 5 పడకల ఆసుపత్రి మండల అవసరాలకు సరిపోవడం లేదని, మెరుగైన వైద్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.