నారాయణపూర్: దేవిరెడ్డి బంగ్లా వద్ద ప్రధాన రహదారిపై త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించిన రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద ప్రధాన రహదారిపై పుట్టపాక గ్రామానికి చెందిన త్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులు సోమవారం మధ్యాహ్నం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత అలైన్మెంట్ ప్రకారం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మించాలని, వ్యవసాయానికి యోగ్యమైన భూములను ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులను సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కలెక్టర్ మరియు ఆర్డీవో దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.