కళ్యాణదుర్గం: జంబుగుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి, తాగునీటి కోసం కుళాయిల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్న మహిళలు
కుందుర్పి మండలం జంబు గుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం మహిళలు కుళాయిల వద్ద బిందెలను క్యూ లైన్ లో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్యను గ్రామస్తులు తెలియజేశారు. అయినా ఎవరు స్పందించలేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.