మార్కాపురం: సైకిల్ తొక్కుతూ పర్యావరణం పై అవగాహన కల్పించిన తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో ఎస్సై బ్రహ్మనాయుడు సైకిల్ తొక్కుతూ పర్యావరణం పై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆరోగ్యాన్ని పరిరక్షించుటకు మరియు కాలుష్య నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సై తెలిపారు. నిత్యజీవితంలో సైకిల్ తొక్కడం ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనం చేసే పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అన్నారు.