కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిరాశ జనకంగా ముగిసిన పొగాకు కొనుగోలు, రూ.188 కి పడిపోయిన పొగాకు ధర
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో యధాస్థితి తథాగతి అన్న పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. సోమవారం వెన్నూరు, చిన వెంకన్నపాలెం గ్రామాలకి చెందిన రైతులు 968 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 640 బేళ్లు మాత్రమే కొనుగోలుచేసి వివిధ కారణాలతో 308 బేళ్లను తిరస్కరించారు. సగటు ధర రూ.188గా చూయించారు. ప్రభుత్వం 200లకు తగ్గకుండా కొనుగోలుచేయాలని సూచించినప్పటికీ వ్యాపారుల్లో మార్పులేదని రైతులు వాపోయారు.