గిద్దలూరు: కంభం లోని జాతీయ రహదారిపై పెళ్లి బృందాన్ని ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి, వివరాలు వెల్లడించిన అధికారులు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని జాతీయ రహదారిపై వెళ్లి బృందాన్ని శుక్రవారం తెల్లవారుజామున లారీ ఆటో బృందాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతులు గిద్దలూరు మండలం నల్లబండ బజారుకు చెందిన అంకాలు, నగేష్, అలకనంద, నాగేశ్వరిగా పోలీసులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.