మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులలో పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
మార్కాపురం జిల్లా కేంద్రమైనప్పటికీ తగిన విధంగా అభివృద్ధికి నోచుకోలేదు. పట్టణ కేంద్రంలో పారిశుద్ధ్యం తో పాటు పందులు ఆవులు రోడ్లపై ఇచ్చెలవిడిగా తిరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా మురుకు కాలవలు కంపు కొడుతున్నాయి అంతేకాకుండా పందులు కూడా జనావాసాల మధ్య విరవిహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులలో సైతం పందులు సంచరిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.