మార్కాపురం: జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో వెలిసిన బంగారం అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మార్కాపురం తూర్పు వీధిలో వెలసిన బంగారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జూలై 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గణపతి చండీ పారాయణం నవ చండీ హోమం వేద పారాయణం జాలధివాసం దాన్య దివాసం పుష్ప దివాసం దీక్ష హోమాలు జరుగునున్నారు. 8వ తేదీ 9:53 నిమిషాలకు అమ్మవారి విగ్రహ, శిఖర ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.