గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించిన దొంగకు ఆరు నెలల కఠిన కారాగార జైలు శిక్ష విధించిన కోర్టు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2025వ సంవత్సరంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించిన సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టి పూర్తి సాక్షాదారులతో పోలీసులు నేరాన్ని నిరూపించారు. గురువారం విచారణ అనంతరం న్యాయమూర్తి భరత్ చంద్ర నిందితుడికి ఆరు నెలలు కఠిన కారాగార జైలు శిక్ష విధించారు.