కొండపి: మర్రిపూడి మండలంలో ఓ మోస్తరు వర్షం, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఉపశమనం పొందిన ప్రజలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగింది. ఈదురు గాలులు వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతన్నలు మరిన్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.