యర్రగొండపాలెం: సీఎం వెలుగొండ ప్రాజెక్టు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
జూన్ 27వ తేదీ వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. దోర్నాల వెలుగొండ ప్రాజెక్టు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీతతో కలిసి పరిశీలించారు. కొంతమంది నిర్వాసితులకు సీఎం చేతుల మీదుగా పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ మీటింగ్, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించామన్నారు.