రాయదుర్గం: ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు
నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని AISF జిల్లా కోశాధికారి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం రాయదుర్గంలో MEO కు పిర్యాదు చేసి విలేకరులతో మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోకపోతే డిఈఓ కార్యాలయ ముట్టడి చేపడతామని ప్రకటించారు.