రాయదుర్గం: వినూత్న రీతిలో పెళ్లి శుభలేఖ, అభినందించిన సిఐ వెంకటరమణ
డి.హీరేహల్‌కు చెందిన నాగెళ్ల వెంకటేసులు సైబర్ మోసాలపై అవగాహన కోసం తన కుమారుడి వివాహ శుభలేఖను వినూత్నంగా రూపొందించారు. డిజిటల్ అరెస్ట్, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్, APK ఫైళ్లు, ఫేక్ లోన్ యాప్స్, కొరియర్ ఫ్రాడ్ గురించి కార్డులో పొందుపరిచారు. శుక్రవారం రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణకు కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. సీఐ ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ బంధుమిత్రులను సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు చైతన్యం చేయాలని కోరారు.