రాయదుర్గం: తాగునీటి కోసం రోడ్డెక్కిన అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు
రాయదుర్గం పట్టణంలో అంబేడ్కర్ నగర్ వాసులు తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. శనివారం ఉదయం ఖాళీ బిందెలతో గుమ్మగట్ట ప్రధాన రహదారిపై బైటాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. గత నెల రోజులుగా తాగునీటికి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఏడెనిమిది రోజులకొకసారి కూడా నీరు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని కోరారు.