రాయదుర్గం: మొహరం పండుగ నేపథ్యంలో గ్రామాల్లో ఘర్షణలకు సృష్టిస్తే కఠినచర్యలు తప్పవు : రూరల్ సీఐ వెంకటరమణ
మొహర్రం పండుగ నేపథ్యంలో గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడి అశాంతి సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. శనివారం కణేకల్లు మండలం జక్కలవడికి లో ఎస్ఐ నాగమధు, సిబ్బందితో కలిసి పుట్ పెట్రోలింగ్ నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా మొహర్రం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలకు ఆస్కారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.