యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామంలో బి ఎల్ ఏ లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతా లక్ష్మణ హనుమంత్ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఎ లతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ వాటర్ జాబితా సవరణలో ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొనాలన్నారు. ఓటు హక్కు విలువైనదని ప్రతి అర్హులైన ఓటరు తమ హక్కును పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.