గిద్దలూరు: అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో భారీ చోరీ, గోపాలకృష్ణ అనే వ్యక్తి చెందిన ఇంటిలో బంగారం నగదు చోరీ చేసిన దొంగలు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గన్నేపల్లి గ్రామానికి చెందిన కనుమల్లపూడి గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన ఇల్లు, కిరాణా దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి వెనక భాగము నుంచి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు రూ.6 లక్షలు నగదు, 13 తులాల బంగారాన్ని బీరువా బద్దలు కొట్టి చోరీ చేశారు. శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్ళిన గోపాలకృష్ణ.. ఇంటికి వచ్చి చూస్తే సరికి దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు.