మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఇండో ఫ్యాక్టరీ వెనుక ఓ ఇంట్లో మల్లికార్జున రెడ్డి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య
మార్కాపురం ఇండో ఫ్యాక్టరీ వెనక ఓ ఇంట్లో యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు ఇంట్లో ఎవరు లేని సమయంలో మల్లికార్జున రెడ్డి అనే యువకుడు ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతుడు ఆత్మహత్య గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.