మార్కాపురం: జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానం, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు స్థానికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరోపక్క ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్డులో చెత్త వేసి తొలగించకపోవడంతో మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నిరంతరం జనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేయకపోవడం ఏమిటి అని స్థానికులు విమర్శిస్తున్నారు.