మార్కాపురం: పొదిలి పొగాకు కేంద్రంలో ధరలు మరింత దిగజారి పోవడంతో అసహనం వ్యక్తం చేసిన రైతులు
పొదిలి పొగాకు కేంద్రంలో శనివారం ధరలు మరింత దిగజారిపోయాయి. వ్యాపారులు మొక్కుబడిగా కొనుగోలు చేస్తూ అన్నిటికి నోబిడ్ వేస్తుండడంతో ఒకే రోజు భారీగా పొగాకు బేళ్లను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. రోజురోజుకు దిగజారిపోతున్న పొగాకు ధరలపై, వ్యాపారుల తీరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత ఉన్న పొగాకు కూడా నోబిడ్ వేస్తుండడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు