రాయదుర్గం: కుల వివక్ష రూపుమాపేందుకు చట్టాలపై అవగాహనే సరైవ మార్గం : జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్సు కమిటీ మెంబర్ వెంకటరమణ
కుల వివక్షను రూపుమాపేందుకు చట్టాలపై అవగాహనే సరైన మార్గమని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్సు కమిటీ మెంబర్ బి. వెంకటరమణ బాబు అన్నారు. మంగళవారం రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో వెంకట రమణ బాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ రాయ్ లు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా నేటికీ అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం శోచనీయమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిర్మూలించబడిందని వివరించారు.