మార్కాపురం: జిల్లా కార్యాలయాలలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ నాయకులు జెసి శ్రీనివాసులకు వినతి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష కార్యాలయాలలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లో జెసి శ్రీనివాసులకు యుటిఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి మాట్లాడుతూ... సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా కార్యాలయాలు అలంకారప్రాయంగా మిగిలాయన్నారు. ఏ పని కావాలన్నా ఒంగోలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.