యర్రగొండపాలెం: త్రిపురాంతకం జడ్పీహెచ్ పాఠశాలలో ఎంపీడీవో మురళి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాల మేరకు త్రిపురాంతకం జడ్.పి.హెచ్ పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మురళి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. యోగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.