గిద్దలూరు: కంభంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన మహా చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం మహా చండీయాగం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహా చండీయాగంలో పాల్గొని హోమగుండం చుట్టూ ప్రదర్శనలు చేశారు. తర్వాత అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని శాలువాకులములతో సన్మానించారు