మార్కాపురం: మార్కాపురంలో ఓటర్ల అనుసంధాన ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, మండలం వేములకోట గ్రామంలో 2002 సంవత్సరపు ఓటరు జాబితాలోని ఓటర్లను ప్రస్తుత ఓటర్ జాబితాలోని ఓటర్లను అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. జూన్ 5వ తేదీ నాటికి అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత బిఎల్ఓ లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శివరామిరెడ్డి ఎమ్మార్వో చిరంజీవి పాల్గొన్నారు.