దర్శి: బాధ్యత మరిచిన వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి : దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు సంక్షేమం అభివృద్ధి జరుగుతుంటే కొందరు అధికారంలో లేకపోయినా ఇంకా రఫ్ఫా రఫ్ఫా అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. బాధ్యత మరిచి అసెంబ్లీకి వెళ్లకుండా బయట ధర్నాలు చేస్తున్నారని వారు పదవులకు రాజీనామా చేయాలని ప్రజల పక్షాన తము నిలబడతామన్నారు.