రాయదుర్గం: సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం అంటూ టిడిపి మ్యానిపెస్టో ప్రతులు చించేసి నిరసన
సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ ద్వజమెత్తారు. గురువారం రాయదుర్గం వినాయక కూడలిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టిడిపి మ్యానిపెస్టో ప్రతులు చించేసి నిరసన తెలిపారు. మెగా డిఎస్సి పేరుతో యువతను దగా చేశారని, నిరుద్యోగ భృతి, బిసి మహిళలకు పెన్షన్ లు, ఆడబిడ్డ నిధి ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు గొల్ల రామాంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.