రాయదుర్గం: ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ అవగాహన ర్యాలీలు
ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గ్రామ గ్రామాన శనివారం ర్యాలీలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాల పరిధిలో ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో కలసి అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేశారు. 0-5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రజలకు తెలిపి చుక్కలు వేయించేలా చూడాలని పిలుపునిచ్చారు.