తాడిపత్రి: తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే యాడికి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు గమనించి గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామపంచాయతీ అధికారులు మొదట యాడికి ఆసుపత్రికి అనంతరం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై యాడికి సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేపట్టారు.