కళ్యాణదుర్గం: అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నాం: కళ్యాణదుర్గంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి
అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామని కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పే స్వామి అన్నారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం విశ్రాంత ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని బిల్లును పార్లమెంటులో అంటే లోక్ సభ, రాజ్యసభలో ఏ ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించలేదన్నారు. అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో కూడా అందరూ సంఘీభావం తెలిపారన్నారు.