యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం క్లస్టర్ ఇంచార్జి జెడ్డా రవిని పరామర్శించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఒంగోలులో హాస్పటల్లో పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జి జెడ్డా రవి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అలాగే వారి తల్లిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.