మార్కాపురం: శివరాంపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా రెండవసారి గ్రామసభ
మార్కాపురం మండలం శివరాంపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామము నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా రెండవసారి గ్రామసభ నిర్వహించారు. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమంలో 21 అర్జీలు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఎమ్మార్వో చిరంజీవి తెలిపారు. అందులో భాగంగా రెవెన్యూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు