గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో గురించి ఉసురుమనిపిస్తున్న మబ్బులు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు, ప్రజలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో రైతులు ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితం వాతావరణ శాఖ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే మబ్బులు ఉదయం సాయంత్రం దట్టంగా వస్తున్నాయే తప్ప పెద్దగా వర్షాలు పడుతున్న ఆనవాళ్లు లేవు. దీంతో ప్రజలు రైతులు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా కొనసాగితే నీటి ఎద్దడితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే పట్టణంలో నీటి భూగర్భ జలాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు. రైతులు కూడా పంట సాగు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.