నంద్యాల అర్బన్: మున్సిపల్ హైస్కూల్లో నిర్మాణాలు నిలిపివేయాలి : బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్
Nandyal Urban, Nandyal | Nov 12, 2026
నంద్యాల ఓల్డ్ టౌన్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు అసౌకర్యం కలిగించే నిర్మాణాలను నిలిపివేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పాఠశాలలో గతంలో సాంకేతిక విద్య కోసం నిర్మించిన గదులను తొలగించి, వాటి స్థానంలో విద్యాశాఖ కార్యాలయాల నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆ సంఘం వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు కె. సతీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.