రాయదుర్గం: ముందస్తు జాగ్రత్తతోనే వడదెబ్బ నివారణ : మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్
ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలోకి అధిక వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత ఉంటాయని దీనివల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయ పరిస్థితులు కలుగే అవకాశం ఉందని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్ తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ తీవ్రపరిస్థితి ల నుండి బయట పడవచ్చున్నారు. రాయదుర్గం మండల పరిధిలోని మల్లాపురం, సహా వివిధ గ్రామాల్లో గ్రామసభ ద్వారా ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి నివారణ గురించి ప్రజలకు వివరించారు. వడదెబ్బను ముందుగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవచ్చని సూచించారు. రోజుకు 15 గ్లాసుల నీరు, మజ్జిగ తీసుకోవాలని ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకుని ఇంటికి చేరాలని సూచించారు.