కొండపి: సింగరాయకొండ పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి, వేసవి కాలం కావడంతో భారీగా తరలివచ్చిన పర్యటకులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుంచి సముద్ర తీరానికి తరలి వచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.