మార్కాపురం: గిన్నిస్ రికార్డు సాధించిన మార్కాపురం చిన్నారులు సురభి సోనిత్, సురభి మోక్ష
మార్కాపురం పట్టణానికి చెందిన చిన్నారులు సురభి సోనీత్ సురభి మోక్ష గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ధ్రువపత్రాలను అందుకున్నారు. గత ఫిబ్రవరి రెండవ తేదీ విజయవాడలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 22 దేశాలకు చెందిన దాదాపు 2వేల మంది కీబోర్డ్ వాయిద్య కారులు ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులకు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు దృపత్రాల అందజేశారు. అందులో అన్నా చెల్లెలు సోనీత్ మోక్ష గిన్నిస్ వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలను అందుకున్నారు.