గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 8వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 8వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.