యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య పై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన డిఎల్డిఓ బాలు నాయక్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీలోని పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య పై అవినీతి ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఎర్రగొండపాలెం కి చెందిన వేణుగోపాల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి బాలునాయక్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై విచారణ చేపట్టేమని తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలను సంబంధిత ఉన్నత అధికారులకు సమర్పిస్తామని బాలు నాయక్ తెలిపారు.