కొండపి: కొండపి పోలీస్ స్టేషన్ ఆవరణలో జర్నలిస్ట్ హత్యపై నిరసన తెలిపి విన్నతి పత్రాన్ని అందజేసిన జర్నలిస్టు సంఘం నేతలు సభ్యులు
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్ హత్యను ఏపీడబ్ల్యూజే నాయకులు ఖండించారు. ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్లో వినతి పత్రంఇచ్చారు. అనంతరం ఆ సంఘం నాయకుడు లింగయ్య మాట్లాడుతూ.. నిజాయితీగా వార్తలు రాసే జగన్మోహన్ రెడ్డిని శ్రీగంధం స్మగ్లర్ దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారని ఆరోపించారు. వార్తలు రాస్తే ఇలా చంపేస్తారా? అని ప్రశ్నించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.