గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో రెండు సంవత్సరాల వరకు పొగాకు పంట వేయకూడదని తీర్మానించిన రైతు సంఘం నాయకులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రెండు సంవత్సరాల వరకు పొగాకు రైతులు పొగాకు సాగు చేయకూడదని రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులు మరియు సమైక్య సంఘం నాయకులు తీర్మానించారు. బుధవారం గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్లో రైతుల సమావేశం జరిగింది. రెండు సంవత్సరాలకు పైగా అవసరమయ్యే పొగాకు సాగు ముందుగానే రైతులు సాగు చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేకపోతుందని కాబట్టి రైతులు అవసరమైతే క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతు సంఘం నాయకులు రైతులకు తెలిపారు.