రాయదుర్గం: కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డి సహదేవుడు
రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన డాక్టర్ డి సహదేవుడు ప్రిన్సిపాల్‌గా డా. డి. సహదేవుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా పని పనిచేశారు. కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్స్, అధ్యాపక బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల సమగ్రాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, విశ్వవిద్యాలయ, ఉన్నత విద్యాశాఖ అధికారుల సహకారంతో పనిచేస్తానని తెలిపారు. అనంతరం తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిసరాలను పరిశీలించారు.