కొండపి: సింగరాయకొండ కనుమల్ల సమీపంలో తెగిపడ్డ విద్యుత్ వైర్లు, జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్ల సమీపంలో వాహనదారులకు పెను ప్రమాదం తప్పింది. 11 కెవి విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. అటువైపు నుంచి వెళ్తున్న వాహనదారులు గమనించారు. వెంటనే అక్కడికి చేరుకున్న హైవే పోలీసులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని వైర్లను తొలగించారు. పరిస్థితిని చక్కదిద్యారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.