కొండపి: సింగరాయకొండ లో బావిలో మృతి చెందిన వ్యక్తి తెలంగాణకు చెందిన రాహుల్ దేనని నిర్ధారించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ని మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించారు. మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సింగరాయకొండ మండలంలో గత నెల బావిలో దొరికిన మృతదేహం తెలంగాణకు చెందిన విద్యార్థి రాహుల్ దేనని నిర్ధారించినట్టు తెలిపారు. డిఎన్ఏ పరీక్షల అనంతరం రాహుల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్పీ అన్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉందని అన్నారు.