యర్రగొండపాలెం: దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. నటరాజ్ కూడలిలో కోటి రూపాయలతో బస్టాండ్ పనులను ప్రారంభించారు. ప్రతిరోజు 400కు పైగా బస్సులు వేలాదిమంది యాత్రికులు శ్రీశైలానికి ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ఆధునిక సదుపాయాలతో బస్టాండ్ నిర్మాణము ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.