ఉరవకొండ: ముద్దలాపురంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
కూడేరు మండలం ముద్దలాపురం గ్రామ సమీపంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం కావడంతో ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.